Wednesday, February 15, 2017




మహావీర జయంతి



రత ఖండంలో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలోనే అనేక సంస్కరణోద్యమాలు బయలుదేరాయి. మతం పేరుతో జరుగుతున్న అనేక మూఢాచారాలను నిలదీశారు. బౌద్ధ‌మత వ్యవస్థాపకుడు, జైనమత చివరి తీర్థంకరుడు మహావీరుడు ఈ కాలం నాటివారే కావడం విశేషం.

మహావీరుడిగా ఎదిగిన వర్ధమానుడు
జైనమతంలో 24వ తీర్థంకరుడు మహావీరుడు. తీర్థంకరుడు అంటే గురువు అని అర్థం. తల్లి త్రిశాల, తండ్రి సిద్ధార్థుడు. తల్లి త్రిశాల గర్భంతో వున్నప్పుడు ఆమెకు అనేక మంచి స్వప్నాలు కనిపించేవి. జ్యోతిష్కులు ఆమెకు మహాచక్రవర్తి కానీ తీర్థంకరుడు కానీ జన్మిస్తాడని వెల్లడిస్తారు. 30 ఏళ్ల వచ్చేసరికి వర్ధమానుడిలో ఒక రకమైన ఆధ్యాత్మిక చింతన ఏర్పడింది. జీవితంలో జరిగే అనేక సంఘటనలు ఆయనపై బలంగా ముద్రవేశాయి. దీంతో ఆయన రాజ్యాన్ని వదిలేసి దేశాంతర పర్యటన చేశాడు. ఈ క్రమంలో ఆయన అహింస ప్రాధాన్యతను గుర్తించారు. జైనమతంలో త్రిరత్నాలైన సమ్యక్‌ దర్శనం, జ్ఞానం, జీవనంపై ఆయన విశేష అధ్యయనం చేశారు. అహింస, సత్యం, అపరిగ్రహ, అస్థేయ ( దొంగతనం చేయకుండా వుండటం) సిద్ధాంతాలు జైనమతానికి ప్రధాన స్తంభాలు. మహావీరుడు ఈ నాలుగు సిద్ధాంతాలకు బ్రహ్మచర్యాన్ని జోడించారు. జైన మత వ్యవస్థాపకుడు రుషభనాధుడు. యావత్‌ మానవాళి ఉన్నతితో పాటు సకల జీవరాశుల గురించి మహావీరుడు తన ప్రసంగాల్లో బోధించేవారు.

No comments:

Post a Comment