సంకటహర చతుర్థి
ఫిబ్రవరి 14
సకల
విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు. ఆయనను పూజిస్తే
అన్నిసంకటాలు తొలగిపోతాయి. అందుకనే ప్రతిమాసంలో పౌర్ణమి అనంతరం
వచ్చే చతుర్థినాడు సంకటహర చతుర్థిని నిర్వహిస్తాం. దీనినే సంకష్టహార
చతుర్థి అని కూడా అంటారు. చవితికి అధపతి వినాయకుడు. స్వామిని ఈ రోజున
నిండుమనసుతో కొలిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతిపురాణం
పేర్కొంటుంది. సాధారణంగా ఈ పూజ చేసేవారు ఆ రోజున ఉపవాసముండాలి.సాయంత్రం
చంద్రదర్శనం తరువాత విరమించాలి. సమీప గణపతి ఆలయంలో జరిగే
సంకటహారచతుర్థి వ్రతంలోపాల్గొనాలి. వినాయకచవితిరోజున చంద్రున్ని
చూడకూడదు. అయతే సంకటహార చతుర్థి రోజున చంద్రున్ని చూడాలి.
మంగళవారంనాడు వచ్చే సంకటహారచతుర్థిని అంగారక చతుర్థి అంటారు. ఈ
రోజున ఈ వ్రతంనిర్వహిస్తే మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయి.
No comments:
Post a Comment